శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 27 జూన్ 2020 (09:45 IST)

జూలై 1న కోటప్పకొండ ఆలయ దర్శనం బంద్.. ఎందుకో తెలుసా?

గుంటూరు జిల్లా కోటప్పకొండ ఆలయంలోని త్రికోటేశ్వర స్వామి దర్శనం నిలిపేయనున్నట్లు ఆలయ నిర్వహకులు తెలిపారు.

తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా త్రికోటేశ్వర స్వామి వారికి దేవస్థానం వేద పండితుల సమక్షంలో కైంకర్యాలను నిర్వహించడం జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం ఈవో అన్నపరెడ్డి రామకోటి రెడ్డి పత్రికల వారికి విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. కోవిడ్ 19 కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని.. తొలి ఏకాదశి రోజున భక్తులకు స్వామివారిని దర్శనంనకు కానీ, సేవల కానీ అనుమతి లేదని తెలియజేసినారు.

భక్తులు ఈ మార్పును గమనించి సహకరించవలసినదిగా కోరుతున్నామన్నారు.