సంబంధిత వార్తలు
రూ.50 కోట్ల విలువైన వెంకన్న స్థలంపై భూ బకాసురుల కన్ను!
దేవుని మాణ్యాలు కనిపిస్తే చాలు రాకాసి గద్దలు వాలిపోతున్నాయి. దేవాదాయశాఖ చట్టంలో లొసుగులుతో దేముడి స్థలాలు కాజేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి కబ్జాలకు దేవాదాయశాఖ మంత్రి అనుచరులు సూత్రధారులు కావడంతో దేవాదాయ, ధర్మాదాయశాఖ అధికారులకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. ఇదీ ఇపుడు ఆంధ్రప్రదేశ్ లోని దేవాదాయ శాఖ దుస్థితి.
బెజవాడలో ఇప్పటికే గుట్టు చప్పుడు కాకుండా వందల కోట్ల విలువైన దేముడి మఠం, సత్రం భూములు కబ్జాకు గురయ్యాయి. తాజాగా విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని రామలింగేశ్వర నగర్ లో ని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన 50 కోట్ల విలువైన భూమిపై కొనకళ్ళ విద్యాధరుడి కన్ను పడింది. ఇతనికి వయసు పైబడుతున్నా, దేముడి భూములు ఉన్నాయని తెలిస్తే చాలు.... అతని కళ్ళు మెరిసిపోతాయి. వాటిని ఎలా కబ్జా చేయాలా అని చాలా తీక్షణంగా అ భూములపై చూస్తాడు. రామలింగేశ్వర నగర్ లో అదే జరిగింది.
దాదాపు 50 ఏళ్ల క్రితం కొందరు దాతలు వన్ టౌన్ బ్రాహ్మణ వీధిలో శ్రీ వెంకటేశ్వర స్వామి కి రామలింగేశ్వర నగర్ (పుట్టరోడ్డు)లో 1.98 ఎకరాలను దేముడికి దానంగా ఇచ్చారు. ఆ రోజుల్లో ఎంత ధర పలికేదో గాని, ఇప్పుడు మార్కెట్ రేటు ప్రకారం 1.98 ఎకరాల భూమి 50 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. సర్వే నెం:50/1,50/2 లో ఉన్న దేముడి భూమి కార్పొరేషన్ పరిధిలో ఉండటంతో ఆ స్థలం కాళీగా వదిలేశారు. దేవాదాయశాఖ 43 రిజిస్టర్ లో ఈ స్థలం దేవాదాయ భూమిగా నమోదైంది. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అధికారులు అజమాయిషీ లేకపోవడంతో 20 ఏళ్ల క్రితమే 1.98 ఎకరాల భూమిలో0.75 ఎకరాలు అన్యాక్రాంతం అయ్యింది. ఈ భూమిలో 150 మంది శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకొన్నారు. అప్పటికి దేవస్థాన అధికారులు మేల్కొని, అన్యాక్రాంతం కాగా మిగిలిన భూమిని రక్షించుకొన్నారు. ఆక్రమణ దారులపై దేవస్థానం న్యాయస్థానంను ఆశ్రయించగా, 2005 లో హైకోర్టు ఆక్రమణలు తొలగించి భూమిని దేవస్థానం కు అప్పగించాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే అప్పుడే ఆక్రమణలు తొలగించే ప్రయత్నం చేయగా, అప్పటి ప్రజాప్రతినిధి దేవినేని నెహ్రు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనితో దేవాదాయశాఖ వెనక్కు తగ్గి, ఆక్రమణలు స్థలం వదిలేసి మిగిలిన స్థలంను సంరక్షించుకొంది.
ఇపుడు దేవాదాయ శాఖ మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టిన తరువాత బ్రాహ్మణ వీధిలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానం ట్రస్ట్ గా పని చేసిన కొనకళ్ళ విద్యాధరుడు కన్నురామలింగేశ్వర నగర్ స్థలంపై కన్ను పడింది. 2005 లోని కోర్టు ఉత్తర్వులు అడ్డం పెట్టుకొని, ఈ స్థలాన్ని కాజేసేందుకు పథకం వేసాడు. 0.75 ఏకరాల్లోని 150 మంది ఆక్రమణదారులను తొలగించి, 1.98 ఎకరాల భూమిని లీజు ప్రాతిపదికన చేజిక్కించుకోవాలని పధకం రచించాడు. ఈ భూమి వల్ల దేవస్థానంకు ఆదాయం రావడం లేదని ఈవో హారనాధ్ ద్వారా ఫైల్ ముందుకు కదిపాడు.
ముందుగా 3 ఏళ్ళు లీజు ప్రాతిపదికన ఈ విలవైన స్థలాన్ని దక్కించుకొంటే, ట్రస్ట్ ద్వారా 11 ఏళ్ళు, ఆ తరువాత 33 ఏళ్ళు పాటు రూల్ ను అడ్డంపెట్టుకుని దోచే కుట్రకు విద్యాధరుడు పధకం పన్నాడు. ఈ ఒక్క స్థలమే కాదు. ఇప్పటికే వన్ టౌన్ లోని మఠాలు, సత్రాల భూములు కబ్జా చేస్తున్న విద్యాధరుడు ఏ విధంగా అయినా రామలింగేశ్వర నగర్ స్థలం కొట్టేసే పనిలోనే ఉన్నాడు.ఇదంతా మంత్రి వెల్లంపల్లి కనుసన్నల్లోనే జరుగుతుందని దేవాదాయశాఖలోనే పెద్ద టాక్ నడుస్తోంది.