అల్పపీడన ఉపరితల ఆవర్తనం.. ఏపీలో పలు చోట్ల వర్షాలు  
                                       
                  
				  				  
				   
                  				  అల్పపీడన ప్రాంత అనుబంధ ఉపరితల ఆవర్తనం ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాగల మూడు రోజుల వరకు వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయనే దానిపై రిపోర్ట్ విడుదల చేశారు. 
				  											
																													
									  
	 
	ఈ రిపోర్ట్ ప్రకారం.. ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో మూడు రోజుల పాటు వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ముఖ్యంగా ఇవాళ ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంటుందన్నారు. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే ఛాన్స్ ఉందన్నారు.
				  
	 
	ఇక దక్షిణ కోస్తాంధ్రాలోనూ ఇదే రకమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇవాళ దక్షిణ కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని చెప్పారు. 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఇక ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పలు చోట్ల పడే అవకాశం ఉందని వెల్లడించారు. రాయలసీమ ప్రాంతంలో కూడా వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాయలసీమ పరిధిలోని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు.