శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , గురువారం, 19 ఆగస్టు 2021 (10:02 IST)

పాకిస్థాన్, చైనాల‌ కవ్వింపు చర్యల‌ను తిప్పికొట్టాలి

భారతదేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసే ప్రయత్నం పాకిస్థాన్ చేస్తోంద‌ని కేంద్ర ప‌ర్యాట‌క‌శాఖ మంత్రి కిష‌న్ రెడ్డి చెప్పారు. పాకిస్థాన్, చైనాల‌ చర్యలను తిప్పికొట్టాల‌న్నారు.

తిరుపతిలో కపిలతీర్థం సమీపంలోని అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులను స్మరించుకుంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాళులు అర్పించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సతీమణులను కేంద్రమంత్రి కిష‌న్ రెడ్డి సన్మానించారు. మోడీ హయాంలో దేశంలో ఎక్కడా అల్లర్లు, ఉగ్రవాదుల దుశ్చర్యలు జరుగలేద‌ని, దేశ ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలోనే ఉన్నార‌ని చెప్పారు. దేశం కోసం త్యాగం చేసిన వారిని ఎప్పటికీ గుర్తించుకోవాల‌ని, దేశ రక్షణ కోసం తిరుపతి లాంటి ప్రాంతంలో ఎంతోమంది ప్రాణాలను కోల్పోయార‌ని, అలాంటి సైనికుల కుటుంబాలకు అండగా ఉండాల‌ని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు.

వీర సతీమణుల ఆశీర్వాదం తీసుకోవాలని ప్రధానమంత్రి సూచించారని, సైనికుల వల్లే దేశంలో ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నామ‌న్నారు. దేశ సమగ్రతను కాపాడాల్సిన అవసరం ఉంద‌ని కేంద్ర ప‌ర్యాట‌క‌శాఖ మంత్రి కిష‌న్ రెడ్డి చెప్పారు.