1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. mutton rates down in chittoor district

వ్యాపారుల మధ్య పోటీ - రూ.50కే మటన్ విక్రయాలు

mutton
చిత్తూరు జిల్లాలో మటన్ ధర ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో జనం మటన్ కొనేందుకు ఎగబడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలో వ్యాపారస్తుల మధ్య తీవ్రమైన పోటి నెలకొనడంతో మటన్ ధరలు ఒక్కసారిగా  పడిపోయాయి. వ్యాపారులు పోటీపడి మరీ ధరలు తగ్గించడంతో కిలో మాంసం రూ.50కే లభించింది. 
 
తొలుత గాంధీ బస్టాండ్ వద్ద ఓ దుకాణం దారుడు కిలో మటన్ ను రూ.300కు విక్రయించాడు. దీంతో అతడి దుకాణానికి కొనుగోలు దారులు క్యూ కట్టారు. దీంతో ఇతర దుకాణం దారులు కూడా పోటీపడి రూ.200 నుంచి వందకు తగ్గించేశారు. ఇలా తగ్గించుకుంటూ పోయారు.
 
చివరికి ఓ దుకాణందారుడు రూ.50కే విక్రయించారు. దీంతో కొనుగోలు దారులు ఒక్కొక్కరు ఐదు నుంచి పది కిలోల వరకూ కొన్నారు. దీంతో రాత్రి 7.30 రూ స్టాక్ మొత్తం అమ్ముడుపోయింది.  
తర్వాతి కథనం
చిత్తూరుజిల్లాలో జల్లికట్టు.. ఇద్దరికి గాయాలు..?