1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Nara Lokesh fire comments on Local Body Elections Nomination proces

ప్రశాంత వాతావరణంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు : మంత్రి నారా లోకేశ్

Nara Lokesh
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నాయని రాష్ట్రమంత్రి నారా లోకేశ్ అన్నారు. దీనికి నిదర్శనమే 22800కు పైగా నామినేషన్లు దాఖలు కావడమే నిదర్శనమన్నారు. అన్ని వర్గాలు, పార్టీలు, ప్రతి ప్రాంతం నుంచి అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచేందుకు ముందుకొచ్చారని తెలిపారు. 
 
ఒక్క ఓటు కూడా పడకముందే ఎన్నికలపై ఆరోపణలు చేసేవారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఎన్నికల్లో గెలుపోటములు నిర్ణయించేది మీడియా సమావేశాలు కాదని, ప్రజాక్షేత్రమేనని పరోక్షంగా వైకాపా అధ్యక్షుడు జగన్‌కు కౌంటర్ ఇచ్చారు. ప్రజల వద్దకు వెళ్లాలని, అంతిమంగా ప్రజలే తీర్పు ఇస్తారని లోకేశ్‌ పేర్కొన్నారు. 
 
ఇదిలావుంటే, కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియో కీలమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. మున్సిపల్ ఛైర్మన్ స్థానంతో పాటు వార్డు కౌన్సిలర్ స్థానాలకు వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. దీంతో కుప్పంలో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. 
 
మున్సిపల్ చైర్మన్ పదవి కోసం ఏకంగా 13 నామినేషన్లు దాఖలు కాగా, ప్రధాన పార్టీలైన టీడీపీ తరపున రాజ్‌కుమార్, వైకాపా తరపున గణేశ్ తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. ఇక కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డు కౌన్సిలర్ స్థానాలకు గాను మొత్తం 282 నామినేషన్లు వచ్చాయి. ఇందులో అత్యధికంగా టీడీపీ 146 నామినేషన్లు దాఖలు చేయగా, వైకాపా 99 నామినేషన్లతో రెండో స్థానంలో జనసేన 13, బీజేపీ 2 నామినేషన్లు సమర్పించాయి. మరో 22 మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
Pawan Kalyan: రహదారిని ధ్వంసం చేసిన వైఎస్సార్సీపీ నేతలు.. పవన్ కల్యాణ్ సీరియస్