సంబంధిత వార్తలు
- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
- కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు- పవన్ కళ్యాణ్
- VarunTej: వాలీబాల్ శిక్షణలో మోకాలికి గాయమైన వరుణ్ తేజ్‌కు శస్త్రచికిత్స
- నారీ శక్తి వందన్‌కు మద్దతు ఇవ్వండి : టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు లేఖ
- Rajinikanth : జైలర్ 2లో షారుఖ్ ఖాన్ ప్లేస్‌లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడా ?
దటీజ్ పవన్ కళ్యాణ్ : పిఠాపురం స్థాయి పెంపు - రూ.37 కోట్లతో రైల్వే స్టేషన్ అభివృద్ధి
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ మరో అరుదైన రికార్డును సృష్టించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం స్థాయిని పెంచారు. ఇప్పటివరకు పిఠాపురం సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉంది. ఇపుడు దీన్ని సెలక్షన్ గ్రేడ్ స్థాయికి ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ హోదా పెంపుతో పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల రూపకల్పన పనులు మరిమంత వేగవంతం కానున్నాయి.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపినట్లు తెలుస్తోంది. పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్, ప్రత్యేక అధికారి పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలించింది. 2021 నుంచి 2025 వరకు మున్సిపాలిటీ ఆదాయ, వ్యయాల రికార్డులను సమీక్షించిన అనంతరం, సెలక్షన్ గ్రేడ్‌కు అర్హత ఉందని నిర్ధారించి ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా రూ.8 కోట్లకు పైగా వార్షిక ఆదాయం ఉన్న మున్సిపాలిటీలకు సెలక్షన్ గ్రేడ్ హోదా కల్పిస్తారు.
ఈ హోదా పెంపుతో పిఠాపురం అభివృద్ధికి మరిన్ని అవకాశాలు లభించనున్నాయి. ఇకపై గ్రూప్-1 స్థాయి అధికారి కమిషనర్‌గా బాధ్యతలు చేపడతారు. మున్సిపాలిటీలో ఉద్యోగుల సంఖ్య పెరగడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేక నిధులు భారీగా అందనున్నాయి. తద్వారా పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులు వేగవంతం కానున్నాయి.
1957లో మున్సిపాలిటీగా ఏర్పడిన పిఠాపురం, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి పాదగయ క్షేత్రం, కుక్కుటేశ్వరస్వామి, పురుహూతికా దేవి శక్తిపీఠం, శ్రీపాద వల్లభుల ఆలయాలకు దేశవ్యాప్తంగా భక్తులు వస్తుంటారు. పెరిగిన జనాభా, భక్తుల రద్దీతో మున్సిపాలిటీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది.
ఇటీవలికాలంలో పిఠాపురం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే 'పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ' (పీఏడీఏ)ని ఏర్పాటు చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం 'అమృత్ భారత్' పథకం కింద పిఠాపురం రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు రూ.37.25 కోట్లు మంజూరు చేయడం గమనార్హం. ఇప్పుడు మున్సిపాలిటీ హోదా పెంపుతో అభివృద్ధి మరింత ఊపందుకోనుంది.
