1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Polavaram Project Deadline Extenxded again

పోలవరం ప్రాజెక్టు గడువును పెంచిన కేంద్రం

polavaram dam
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా పరిగణిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ గడువును కేంద్ర ప్రభుత్వం మరోమారు పొడగించింది. నిజానికి ఈ ప్రాజెక్టు నిర్మాణం గత యేడాదే పూర్తికావాల్సివుంది. కానీ, ఈ గడువును వచ్చే 2024కు పొడగించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడంతో టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ మంగళవారం రాతపూర్వక సమాధానమిచ్చింది. ఈ యేడాది ఏప్రిల్ నాటికే పోలవరం పూర్తి కావాల్సివుందని ఆ ప్రకటన పేర్కొంది. 
 
ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై కేంద్ర జలశక్తి శాఖ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. రాష్ట్ర ప్రభుత్వం అసమర్థ చర్యల వల్లే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం చోటుచేసుకుందని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వహణలోనూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి లోపభూయిష్టంగా ఉందని తెలిపారు. ఈ కారణంగానే నిర్మాణంలో తీవ్ర జాప్యానికి కారణమైందని తెలిపారు. అందుకే పోలవరం నిర్మాణ గడవును మరోమారు పొడగించక తప్పలేదని పేర్కొంది. 
తర్వాతి కథనం
Kerala: NEET పరీక్ష రాయాలంటే అమ్మాయిలు లోదుస్తులు తొలగించాల్సిందేనన్న నిర్వాహకులు.. పోలీసులకు ఓ తండ్రి ఫిర్యాదు