గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 31 మార్చి 2022 (08:55 IST)

ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్ స్పెషల్ డ్రైవ్... గడువు పొడగింపు

తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు మరో శుభవార్త చెప్పారు. తమ వాహనలకు ఉన్న పెండింగ్ చలాన్లను క్లియరెన్స్ చేసుకునేందుకు ఇచ్చిన గడువు ముగిసింది. దీంతో ఈ గడువును మరో 15 రోజుల పాటు పొడగించారు. అంటే ఏప్రిల్ 15వ తేదీ వరకు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని తెలిపారు. 
 
పెండింగ్ చలాన్లను క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు గత కొన్ని రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మార్చి ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అయితే, స్పెషల్ డ్రైవ్‌కు విశేష స్పందన వచ్చింది. దీంతో బుధవారానికి రూ.250 కోట్ల మేరకు పోలీసు శాఖకు ఆదాయం సమకూరింది. 
 
దీంతో ఈ గడువు 31వ తేదీతో ముగియనుండటంతో మరో 15 రోజుల పాటు పొడగిస్తూ తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారులకు మరింత వెసులుబాటు కల్పించేలా పెండింగ్ చలాన్ల క్లియరెన్స్‌ను మరో 15 రోజుల పాటు పొడగిస్తున్నట్టు బుధవారం రాత్రి ప్రకటించింది. ఈ ప్రకటన ప్రకారం చలాన్ల క్లియరెన్స్ ఏప్రిల్ 15వ తేదీ వరకు కొనసాగుతుంది.