శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 మార్చి 2022 (09:43 IST)

ప్రెస్ స్టిక్టర్లపై పోలీసులు ఫైర్... రూ.వెయ్యి ఫైన్.. ఎక్కడ?

హైదరాబాద్ పోలీసులు ప్రెస్ స్టిక్కర్లపై ఫైర్ అయ్యారు.  ప్రెస్‌ స్టిక్కర్లు, బ్లాక్‌ ఫిల్మ్‌లు, పోలీస్‌ స్టిక్కర్లను తొలగించే పనిలో నిమగ్నమైనారు. ప్రెస్ కాకపోయినా ఉత్తుత్తిగా ఇలాంటి స్టిక్కర్లు బండ్ల మీద అతికించుకుని తిరిగే వాళ్లకు ఫైన్‌ వేయాల్సింది.

కానీ నిజమైన జర్నలిస్టులకు వేస్తూ.. వారికి చుక్కలు చూపిస్తున్నారు. ఈ కొత్త రూల్స్‌ నుంచి జర్నలిస్టులకు మినహాయింపు ఇవ్వాలని పాత్రకేయ లోకం కోరుతోంది.
 
అసలు సిసలైన జర్నలిస్టులను పట్టుకుని ఫైన్ కట్టమని దౌర్జన్యానికి దిగుతున్నారు. ఇక నుంచి ప్రెస్‌ స్టిక్కర్లు కనిపిస్తే.. రూ.700 కట్టాల్సిందేనని వార్నింగ్‌ ఇస్తున్నారు పోలీసులు. 
 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అక్రిడేషన్‌ కార్డును చూపించినా.. వినడం లేదు. 40 సంవత్సరాల అనుభవం ఉన్న ఓ ప్రముఖ జర్నలిస్టుకు ఫైన్‌ వేసి.. తమ వక్ర బుద్ది చూపించారు పోలీసులు.
 
జర్నలిస్టు అంటేనే.. 24 గంటల డ్యూటీ. ఓ అర్థరాత్రి రోడ్డు ఎక్కాల్సి ఉంటుంది. అలాంటి సమాజ సేవ చేసే వారిపై ఇలాంటి దౌర్జన్యానికి పాల్పడటం ఏంటని సాటి జర్నలిస్టు ప్రశ్నిస్తున్నాడు.