సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 మార్చి 2022 (12:17 IST)

అల్లు అర్జున్ - కళ్యాణ్ రామ్‌లకు అపరాధం ... ఎందుకంటే?

టాలీవుడ్ హీరోలు అల్లు అర్జున్, నందమూరి కళ్యాణ్ రామ్‌లకు హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు అపరాధం విధించారు. తాము ఉపయోగించే కార్లకు బ్లాక్ ఫిల్మ్ అంటించినందుకు గాను రూ.700 చొప్పున అపరాధం విధించారు. 
 
ఇటీవల హీరో జూనియర్ ఎన్టీఆర్‌ కారుకున్న బ్లాక్‌ఫిల్మ్‌ను తొలగించిన పోలీసులు తాజాగా అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్ కార్లకున్న నల్ల తెరలను జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు తొలగించి చలానాలు విధించారు. 
 
జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 36లోని నీరూప్ చౌరస్తాలో శనివారం తనిఖీలు నిర్వహించిన పోలీసులు అదే సమయంలో అటువైపు నుంచి వెళుతున్న కళ్యాణ్ రామ్, అల్లు అర్జున్ కార్లను ఆపి వాటికున్న నల్లటి తెరలను తొలగించారు. అలాగే, రూ.700 అపరాధం విధించారు. అంతేకాకుండా, ట్రాఫిక్ నిబంధనలు పాటించని మరో 80కి పైగా వాహనాలపై కేసులు నమోదు చేశారు.