1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Pak election commission imposes Rs 50,000 fine on PM Khan for violating election code

ఇమ్రాన్ ఖాన్‌కు షాక్.. ఎన్నికల కమిషన్ జరిమానా

Pakistan
పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు ఆ దేశ ఎన్నికల కమిషన్ జరిమానా విధించింది. ఇటీవల స్వాత్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు గానూ రూ.50వేలు జరిమానా విధించింది. 
 
కైబర్-ఫంఖ్తున్క్వాలో స్థానిక ప్రభుత్వ ఎన్నికలు జరుగుతుండగా.. ప్రచారంలో పాల్గొనవద్దని, మార్చి 15న స్వాత్‌ను సందర్శించొద్దని, అక్కడ జరిగే బహిరంగ సభలకు వెళ్లొద్దంటూ విధించిన ఈసీ నిషేధాన్ని బేఖాతరు చేశారు ఇమ్రాన్.
 
చెప్పిన మరుసటి రోజే ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల సంఘం కొత్త నియమావళి ప్రకారం.. ఎన్నికలు జరిగే జిల్లాల్లో ప్రభుత్వ ప్రతినిధులు పర్యటించారు. 
 
మార్చి 31న కైబర్ పంఖ్తున్క్వాలో రెండో దశ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన ప్రధానికి రెండు సార్లు ఈసీ నోటీసులు జారీ చేసింది. ఇమ్రాన్ ఖాన్‌తో పాటు మరో ఐదుగురికి జరిమానా విధించారు. 
తర్వాతి కథనం
పసిడి ధరలు స్వల్పంగా పడిపోయాయ్..