శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 మార్చి 2022 (09:09 IST)

పీకల్లోతు సంక్షోభంలో పాకిస్థాన్ సర్కారు.. ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం?

పాకిస్థాన్ సర్కారు పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయింది. పడింది. పలువురు ఎంపీలు మద్దతు ఉపసంహరించుకోవడంతో ఇమ్రాన్ ప్రభుత్వం మైనారిటీలో పడింది.  
 
ఇప్పటికే ఇమ్రాన్ సర్కార్‌కు వ్యతిరేకంగా విపక్షాలు గతవారం అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి. తాజాగా ముగ్గురు మంత్రులు, 24 మంది ఎంపీలు రాజీనామా చేయడంతో పరిస్థితి మారిపోయింది. 
 
దీంతో ప్రభుత్వ నిర్వహణలోనూ, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో, విదేశాంగ విధానంలోనూ ఇమ్రాన్‌ఖాన్ విఫలం అయ్యారని విపక్షం ఆరోపిస్తోంది.
 
అయితే, ఇప్పటి వరకు పాకిస్తాన్‌లో ఏ ప్రధాని కూడా పూర్తికాలం పదవిలో కొనసాగలేదు. వచ్చేవారం జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఇమ్రాన్‌ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. 
 
ఇమ్రాన్‌ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 172 సీట్ల మెజార్టీ నిరూపించుకోవాలి. దిగువ సభలో ప్రభుత్వానికి 155 సీట్లు మాత్రమే ఉన్నాయి.
 
నవాజ్‌షరీఫ్ సారథ్యంలోని పాకిస్తాన్ ముస్లింలీగ్ -నవాజ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీలకు కలిపి 163 మంది సభ్యులు ఉన్నారు. ఇక అవిశ్వాసానికి ఇమ్రాన్ ఖాన్ ఒప్పుకుంటారా లేదా అనేది తెలియాల్సి వుంది.