శుక్రవారం, 21 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 మార్చి 2022 (13:11 IST)

మహాకాళేశ్వర ఆలయంలో మహా శివరాత్రి సందడి... 21లక్షల దీపాలు..

Ujjain
మహా శివరాత్రి నాడు, సుప్రసిద్ధ మహాకాలేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఉజ్జయిని నగరంలోని ఈ ఆలయంలో  21 లక్షల ప్రమిదలతో దీపాలను వెలిగించనున్నారు. శివరాత్రి రాత్రి 7 గంటల ప్రాంతంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని 21 లక్షల దీపాలను వెలిగిస్తారు. 
 
ఇకపోతే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్‌కి 80 కి . మీ దూరంలో ఉజ్జయిని నగరంలో క్షిప్రా నదీతీరాన "శ్రీ మహాకాళేశ్వర స్వామి" జ్యోతిర్లింగరూపమున దర్శనమిస్తారు. ఈ ఆలయంలో చితాభస్మంతో చేసే అభిషేకం చాలా ప్రాశస్య్తమైనది.  
 
ఈ ప్రాంతంలో ఎక్కువగా అఘోరలు, కాపాలికులు, తాంత్రికోపాసన చేస్తూ ఇక్కడ గుహలలో నేటికీ కనిపిస్తూంటారు. మరణ భయం ఉన్నవారు, అపమృత్యుదోషాలు ఉన్నవారు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే ఆ దోషాలు పోతాయి. 
Ujjain Mahakaleswara
 
అదేవిధంగా ఈక్షేత్రంలో అష్టాదశ పీఠం అమ్మవారు మహాకాళీగా ఉంది. దీంతో ఈ క్షేత్ర వైభవం మరింత ప్రఖ్యాతి గాంచింది. 
 
మహాకాళ, కాళీ క్షేత్రంలతో ఎందరో కవులకు, జ్ఞానులకు ఈ క్షేత్రం ఆరాధ్యమైంది. కాళిదాసు, భోజరాజు వంటివారు ఉజ్జయినికి చెందినవారే. కాళిదాసును అమ్మ అనుగ్రహించింది ఈ క్షేత్రంలోనే.