శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

భక్తుడుని బూతులు తిట్టి దాడి చేసిన పూజారి

ఆలయంలో స్వామి దర్శనం కోసం వచ్చిన ఓ భక్తుడి పట్ల పూజారి దురుసుగా ప్రవర్తించాడు. అతనిపై దాడి చేయడమేకాకుండా బూతుపురాణం చదివాడు. ఈ ఘటన సికింద్రాబాద్ నగరంలో జరిగి కలకలం రేపుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక ఉప్పల్‌లోని బాలాజీ హిల్స్‌కి చెందిన వాల్మీకి రావు గత రాత్రి 7 గంటల సమయంలో దర్శనం కోసం సికింద్రాబాద్ రైతిపైల్ బస్టాండ్‌కు సమీపంలోని గణేష్ ఆలయానికి వెళ్లాడు. 
 
ఆ తర్వాత పక్కనే ఉన్న చిన్నచిన్న గుడిలో దేవుళ్లను దర్శనం చేసుకునే క్రమంలో ఒక గుడిలోపలికి వెళ్లి దర్శనం చేసుకుంటున్న సమయంలో అనుమతి లేకుండా లోపలికి ఎందుకు వచ్చావ్ అంటూ పూజారి ప్రభాకర్ శర్మ బూతుల పురాణం అందుకున్నాడు. దీంతో వారిద్దరి మధ్య చిన్నపాటి ఘర్షణే జరిగింది. 
 
ఆ తర్వాత ఆ భక్తుడిపై పూజారి చేయికూడా చేసుకున్నాడు. ఈ ఘటన గత ఆదివారం చోటు చేసుకోగా వీడియో ఫుటేజీల ద్వారా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ దాడికి సంబంధించి పూజారిపై భక్తుడు కేసు కూడా పెట్టాడు. దీంతో పోలీసులు పూజారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.