సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 జనవరి 2022 (11:01 IST)

అగ్నికి ఆహుతైన వారసత్వ సంపద - రూ.20 కోట్ల బుగ్గిపాలు

సికింద్రాబాద్ నగరంలో వారసత్వ సంపద అగ్నికి ఆహుతైంది. మొత్తం రూ.20 కోట్ల విలువ చేసే ఆస్తి బుగ్గిపాలైంది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సికింద్రాబాద్ క్లబ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అవి క్షణాల్లోనే క్లబ్ మొత్తానికి వ్యాపించి క్లబ్ మొత్తం కాలిపోయింది. 
 
ఈ ప్రమాదంలో 20 కోట్ల రూపాయలకు పైగా ఆస్తి దగ్ధమైనట్టు సమాచారం. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది. సమాచారం అందువల్ల స్థానిక పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ప్రమాదంపై కారణాలు తెలియాల్సివుంది.