గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 జనవరి 2022 (14:02 IST)

TSలో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు?

కరోనా కేసుల పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు పొడిగించే అవకాశాలున్నాయి. ఈనెల 16 వరకు సెలవులు ఉండగా.. 17 నుంచి విద్యా సంస్థలు తెరవాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మరికొద్ది రోజులు సెలవులు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
 
రాష్ట్రంలో కరోనా ఆంక్షలను 20వ తేదీకి వరకు ప్రభుత్వం పొడిగించిన నేపథ్యంలో.. విద్యా సంస్థలకు సెలవులు కూడా పొడిగించాలని వైద్య,ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. 
 
ఈనెల 20వ తేదీ వరకు రాష్ట్రంలో ర్యాలీలు, సభలను జరపరాదని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దాంతో సెలవులను కూడా 20వ తేదీ వరకు పొడిగిస్తారని తెలుస్తోంది. అయితే సెలవులు పొడిగింపుపై పాఠశాల విద్యాశాఖ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.