1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 జనవరి 2022 (09:43 IST)

హైదరాబాదులో భారీ వర్షాలు: జీహెచ్‌ఎంసీ అప్రమత్తం

హైదరాబాదులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని ఎల్బీనగర్, వనస్థలిపురం, నాగోల్, హస్తినపురం, మీర్పేట్‌లో చిరుజల్లులతో వర్షం కురుస్తోంది. నాంపల్లి, ఖైరతాబాద్, మాసబ్ ట్యాంక్, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడ, కోఠి, గోషామహల్, చాదర్ఘాట్, అంబర్పేట్, హిమాయత్‌నగర్, రామంతపూర్, అంబర్ పేట్, చే నంబర్, గోల్నాక, ఉప్పల్, సైదాబాద్, మలక్‌పేట్‌, చాదర్ఘాట్, అంబర్‌పేట్, దిల్‌షుఖ్‌నగర్‌లో భారీగా వర్షం కురుస్తోంది. 
 
భారీ వర్షంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమయ్యింది. ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటుంది. వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమయ్యింది. ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటుంది. హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. 
 
చల్లటి వాతావరణంతోపాటు పలుచోట్ల వర్షాలు కురిశాయి. దీంతో ఉదయం వేళ బయటకు వచ్చేవారు ఇబ్బంది పడ్డారు. పిల్లలకు సంక్రాంతి సెలవులు రావడంతో స్కూల్‌కు వెళ్లడం తప్పింది. కానీ మిగతా వారు ఆఫీసు వెళ్లడానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది.