శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 జనవరి 2022 (10:17 IST)

హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండి

హైదరాబాద్‌తో పాటు చుట్టూ పరిసరాల్లో భారీ వర్షం కురిసేందుకు అవకాశం వుందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ఎల్లో అలర్ట్ హెచ్చరిక జారీ చేసింది.  ఐఎండి ప్రకారం, ఈ భారీ వర్షాలు కొన్ని ప్రదేశాలలో రోడ్లు మరియు లోతట్టు ప్రాంతాల్లో నీటితో మునిగే అవకాశం వుందని తెలుస్తోంది. 
 
భారీ వర్షాల కారణంగా ట్రాఫిక్ రద్దీ, రోడ్లు జారడం, చెట్లు పడిపోవడం వంటివి జరిగే అవకాశం వుందని ఐఎండీ హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా విద్యుత్ స్తంభాలపై నీరు చేరే ఛాన్సుందని.. ప్రజలు బయటికి వెళ్లొద్దని ఐఎండి తెలిపింది.  
 
భారీ వర్షాల కోసం కార్యాచరణ ప్రణాళికను హైదరాబాద్ జీహెచ్ఎంసీ తగిన చర్యలు తీసుకుంటోంది.  ట్రాఫిక్ రెగ్యులేషన్ కొరకు రోడ్డు మరియు రైల్ ట్రాఫిక్ డిపార్ట్ మెంట్‌ల ద్వారా ఇతర అడ్వైజరీలు జారీ చేయబడతాయి