శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 జనవరి 2022 (09:53 IST)

తెలంగాణాలో విద్యా సంస్థలకు సెలవులు పొడగింపు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా వుంది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని రకాల విద్యా సంస్థలను ఈ నెల 30వ తేదీ వరకు పొడగిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వెల్లడించారు. 
 
ఇదిలావుంటే శనివారం ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యం శాఖ విడుదల చేసిన బులిటెన్ మేరకు, రాష్ట్రంలో 53,073 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా వారిలో 1,963 మందికి ఈ వైరస్ సోకింది. 
 
ఇందులో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,075 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 168, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 150 కేసుల చొప్పున నమోదయ్యాయి. 
 
అదేసమయంలో ఈ కరోనా వైరస్ నుంచి 1,620 మంది కోలుకోగా, ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,07,162 పాజిటివ్ కేసుల నమోదు కాగా, ఈ వైరస్ నుంచి 6,81,091 మందికి కోలుకున్నారు. మరో 22,017 యాక్టివ్ కేసులు రాష్ట్రంలో ఉన్నాయి.