సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (18:01 IST)

సికింద్రాబాద్‌ డిపోలో ఎలక్ట్రిక్ బస్ దగ్ధం

సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు ఒకటి పూర్తిగా దగ్ధమైపోయింది. చార్జింగ్ చేస్తున్న సమయంలో ఎమర్జెన్సీ స్విచ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి, బస్సు మొత్తం వ్యాపించాయి. ఈ మంటలను ఆర్పివేసేలోపు బస్సు పూర్తిగా కాలిపోయింది. 
 
బస్సులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన సిబ్బంది, మిగిలిన బస్సులను దూరంగా తరలించడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపకదళ బృందం ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ప్రమాదంలో కాలిపోయిన బస్సు ధర రూ.3 కోట్ల మేరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు.