మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 జనవరి 2022 (20:13 IST)

ఒమిక్రాన్ లక్షణం.. కండ్లకలక.. టెస్టు చేయించాకే నిర్ధారించుకోవాలి..

కరోనా లక్షణాలలో రోగికి దగ్గు ముఖ్యమైన లక్షణం కాగా, విరేచనాలు రకాల సమస్యలు కనిపిస్తున్నట్లుగా డాక్టర్లు చెప్తున్నారు. అదే సమయంలో, ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలలో కంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
 
కళ్లు ఎర్రగా మారడం, కళ్లలో చికాకు సమస్య, కళ్లలో చూపు మసకబారడం, కళ్లల్లో కాంతి తగ్గడం, నీరు కారం, కళ్లల్లో నొప్పి,  కనురెప్పల పొరలు వాపు వుంటే ఒమిక్రాన్ లక్షణాలని వైద్యులు చెప్తున్నారు. 
 
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌లో కళ్ళకు సంబంధించిన ఈ లక్షణాలు కనిపిస్తాయి. కరోనా సోకిన రోగుల 5 శాతం మంది కండ్లకలక బాధితులు కూడా అయ్యే అవకాశం కనిపిస్తోంది.
 
అయితే, కంటికి సంబంధించిన ఈ లక్షణాలు ఉన్నంతమాత్రాన కరోనా అని నిర్దారించుకోవద్దు.. కచ్చితంగా టెస్టింగ్ ద్వారా మాత్రమే వ్యాధిని గుర్తించాలని వైద్యులు చెప్తున్నారు.