గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 జనవరి 2022 (15:42 IST)

అంతర్జాతీయ విమానాలపై ఫిబ్రవరి నెలాఖరు వరకు నిషేధం

అంతర్జాతీయ విమానాలపై జనవరి 31వ తేదీ వరకు కేంద్రం నిషేధం విధించింది. ప్రస్తుతం ఆ నిషేధాన్ని ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగించింది. ఫిబ్రవరి నెలాఖరు వరకు షెడ్యూల్డ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ప్యాసింజర్ సర్వీసులపై నిషేధం ఉంటుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) బుధవారం వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు బీభత్సమైన రీతిలో నమోదవుతున్న నేపథ్యంలో ఈ నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు పేర్కొంది. 
 
అయితే ఎయిర్ బబూల్ అగ్రిమెంట్స్, మిషన్ వందే భారత్ విమానాలు, ఎయిర్ కార్గో విమానాలకు మాత్రం మినహాయింపు ఉంటుందని డీజీసీఏ స్పష్టం చేసింది. కాగా తొలిసారిగా కరోనా మహమ్మారి కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులను మార్చి 23, 2020 నుంచి నిలిపివేశారు. ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ ప్రకారం జూలై 2020 నుంచి కొన్ని విమానాలను నడుపుతున్నారు.