శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 జనవరి 2022 (19:41 IST)

ఏపీలో 12,615 పాజిటివ్ కేసులు - విశాఖలో ముగ్గురు మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి అనేక రకాలైన చర్యలు తీసుకుంటుంది. అయినప్పటికీ ఈ వైరస్ వ్యాప్తి తగ్గకపోగా రోజురోజుకూ మరింతగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 12,615 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు ఒక్క విశాఖ జిల్లాలోనే చనిపోయారు.  
 
ఇదే అంశంపై ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన మేరకు గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 12338 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలోనే 2,338 కరోనా కేసులు వెలుగుచూశాయి.  అత్యల్పంగా 216 కేసులు వెస్ట్ గోదావరి జిల్లాలో నమోదయ్యాయి. 
 
అలాగే, ఈ కరోనా వైరస్ కారణంగా ఐదుగురు మృతి చెందగా మరో 3,674 మంది కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 21,40,056కు చేరింది. అలాగే, 20,71,658 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 14,528 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 53,871 యాక్టివ్ కేసులు ఉండగా, వీరంతా వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స పొందుతున్నారు.