సోమవారం, 14 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 మార్చి 2022 (14:57 IST)

చంద్రబాబు కారణంగానే పోలవరం నిర్మాణంలో జాప్యం : సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సరిదిద్దలేని మానవ తప్పిదం చేశారని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. అందువల్ల పోలవరం ప్రాజెక్టును నిర్ణీతకాలంలో పూర్తిచేయలేకపోయామని చెప్పారు. 
 
పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. కానీ, గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు కారణంగా ప్రాజెక్టు చాలా ఆలస్యమవుతుందన్నారు. అలాగే, ప్రాజెక్టుపై నెలకొన్న అనేక విషయాలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14 యేళ్లుగా సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పూర్తిగా ముంచేశారన్నారు. అసలు ఈ పని పూర్తి చేశానని చెప్పడానికి చంద్రబాబుకు ఒక్కటీ లేదని ఆరోపించారు. అందుకే ఇపుడు పోలవరం పూర్తవుతోందంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు కడుపు మంటగా ఉందని మండిపడ్డారు.