1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. 'Powrnami garuda Seva' in Srivari Temple

శ్రీ‌వారి ఆల‌యంలో ఏకాంతంగా పౌర్ణమి గరుడసేవ

Powrnami garuda Seva
తిరుమలలో పౌర్ణమి గరుడసేవ ఏకాంతంగా శాస్త్రోక్తంగా జరిగింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా  బుధ‌వారం సాయంత్రం 5నుండి 6గంట‌ల వ‌ర‌కు తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌క మండ‌పంలో సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు త‌న‌కు ఎంతో ప్రీతిపాత్ర‌మైన గరుడ వాహ‌నాన్ని అధిరోహించారు.

కోవిడ్ -19 నిబంధ‌న‌ల మేర‌కు గ‌రుడ వాహ‌న సేవ‌ను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు. కార్య‌క్ర‌మంలో పెద్ద జీయర్ స్వామి, చిన్నజీయ‌ర్‌స్వామి, ఆల‌య డెప్యూటీ ఈవో హ‌రీంద్ర‌నాథ్‌ ఇత‌ర‌ అధికారులు పాల్గొన్నారు.

మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంటల వరకు శ్రీకృష్ణస్వామి ముఖమండ‌పంలో అమ్మవారితో పాటు సుదర్శన చక్రత్తాళ్వార్‌కు శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం నిర్వహించారు.
About Writer
ఎం
తర్వాతి కథనం
దేశ రాజకీయాలను జగన్ శాసించడం ఖాయం: మంత్రి ధర్మాన కృష్ణదాస్