మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 2 సెప్టెంబరు 2020 (16:07 IST)

గుడ్ జాబ్ సిఎం జగన్, ఏం చేశారంటే?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి తన గొప్పతనాన్ని చాటుకున్నారు. అతి వేగంగా వెళుతున్న తన కాన్వాయ్ పక్కన ఆంబులెన్స్‌ను చూసిన సిఎం వెంటనే దారి ఇవ్వాలని ఆదేశించారు.
 
పులివెందుల నుంచి తిరిగివచ్చిన సిఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయలుదేరారు. గూడవల్లి నిడవనూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న ఆంబులెన్స్ అటు వైపుగా వెళుతోంది. 
ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్ పైన వెళుతున్న శేఖర్ అనే వ్యక్తి ఉషారామ ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యాడు. అతన్ని నేషనల్ హైవే ఆంబులెన్స్ ద్వారా విజయవాడ ఈఎస్ఐ ఆసుపత్రికి తరలిస్తుండగా ఆంబులెన్స్ కనిపించింది. 
 
దీంతో సిఎం వెంటనే సెక్యూరిటీని అలెర్ట్ చేశారు. ఆంబులెన్స్‌కు దారి ఇవ్వమని ఆదేశించారు. వెంట వెంటనే సెక్యూరిటీ సిబ్బంది వాహన శ్రేణిని దూరంగా మెల్లగా నడిపారు. దీంతో ఆంబులెన్స్ వేగంగా ఆసుపత్రి వైపు వెళ్ళింది.