దొరక్కదొరక్క దొరికిన పులస.. రూ.22వేలతో రికార్డ్
Pulasa
తూర్పుగోదావరి జిల్లా రాజోలు ఫిష్ మార్కెట్‌లో మూడు కేజీల పులస చేప ఏకంగా 22వేల రూపాయలు పలికింది. ఈ సీజన్‌లో దొరికిన మొదటి పులస కావడంతో దాన్ని దక్కించుకోవడానికి ఎగబడ్డారు పులస ప్రియులు.
చివరకు రాజోలుకు చెందిన బైడిశెట్టి శ్రీరాములు ఈ పులసను దక్కించుకున్నాడు. ఈ సీజన్‌లో దొరక్కదొరక్క దొరికిన పులస 22వేల రూపాయలు పలికింది.
