ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 అక్టోబరు 2022 (10:16 IST)

ప్రేమ పెళ్లి, కిడ్నాప్: తిరుపతి ఎస్పీని కలిసిన నవ దంపతులు..

marriage
నవ డాక్టర్ దంపతులు తిరుపతి ఎస్పీని కలిశారు. తమకు భద్రత కల్పించాలని వేడుకున్నారు. చంద్రగిరి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మోహన్ కృష్ణకు సుష్మ అనే మరో డాక్టర్‌తో రెండు నెలల క్రితం వివాహం జరిగింది. అయితే సుష్మ తల్లిదండ్రులు వీరి వివాహానికి అంగీకారం తెలపలేదు. 
 
ఇంకా సుష్మను మోహన కృష్ణ ఇంటి నుంచి కిడ్నాప్ చేశారని తెలిపారు. మోహన్ రెడ్డి కాలనీ, చంద్రగిరిలోని మోహన్ కృష్ణ ఇంట సుష్మ కిడ్నాప్ గురైందని చెప్పారు. అలాగే సుష్మా తల్లిదండ్రులతో పాటు 30మంది తన భార్య సుష్మను బలవంతంగా కిడ్నాప్ చేశారని మోహన్ కృష్ణ ఆరోపించాడు. 
 
అయితే సుష్మా వారి నుంచి తప్పించుకుని.. తన భర్త వద్దకు చేరుకుంది. ఆపై, సుష్మ-మోహన్ కృష్ణ దంపతులు తిరుపతి ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డిని భద్రత కోసం కలిశారు. ఇంకా తమకు భద్రత కల్పించాలంటూ పోలీసులను కోరారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.