ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2022 (08:44 IST)

గోదావరిలో పులస చేపల ప్రవాహం - మళ్లీ దొరికింది.. ధర రూ.23 వేలు

pulasa fish
ఇటీవలికాలంలో గోదావరి నదిలో పులస చేపల ప్రవాహం అధికంగా కనిపిస్తుంది. దీంతో ఈ చేపలను పట్టుకునేందుకు జాలర్లు పోటీపడుతున్నారు. తాజాగా ఓ పులస చేప లభించింది. దీని ధర రూ.23 వేల పలికింది. 
 
గత వారం యానాం మార్కెట్‌లో గత వారం రెండు కేజీల బరువురున్న పులస చేప రూ.19 వేలకు పార్వతి అనే మహిళ కొనుగోలు చేసి దాన్ని మరో వెయ్యి లాభంతో రూ.20 వేలకు విక్రయించింది. ఈ చేపను భైరవపాలెంకు చెందిన వ్యక్తిని దానిని రూ.20 వేలకు అమ్మేశారు. తాజాగా బరువున్న చేపకు అంతకుమించిన ధర పలికింది. 
 
ఓ జాలరికి చెందిన చిక్కిన రెండు కిలోల బరువున్న పులసను ఆదివారం సాయంత్రం స్థానిక రాజీవ్ బీచ్‌లోని వేలం కేంద్రం వద్ద వేలం వేశారు. పొన్నమండ రత్నం అనే మహిళ దానిని రూ.22 వేలకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత దానిని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలి టి కొత్తపల్లి చెందిన వెంకటేశ్వర్లు రూ.23 వేలకు కొనుగోలు చేశారు.