గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 ఆగస్టు 2022 (12:55 IST)

ఏపీలో బరితెగించిన వైకాపా నేత.. 16 యేళ్ల బాలికతో వివాహం

marriage
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా నేతలు బరితెగించిపోతున్నారు. సభ్యసమాజం తలదించుకునే పనులకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారికి పోలీసులు రక్షణం పూర్తిగా లభిస్తుంది. దీంతో వారు మరింత స్వేచ్ఛగా రెచ్చిపోతున్నారు. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లాలో అధికార వైకాపాకు చెందిన గ్రామ కమిటీ అధ్యక్షుడైన 62 యేళ్ళ వృద్ధుడు 16 యేళ్ల మైనర్ బాలికను రహస్యంగా వివాహం చేసుకున్నాడు. 
 
ఆ బాలికకు దెయ్యం పట్టిందని నమ్మించి ఓ మాంత్రికుడితో క్షుద్రపూజలు చేయించాడు. ఆ తర్వాత తన వల్లే ఆ బాలికకు దెయ్యం తొలగిపోయిందని బాలిక తల్లిదండ్రులను నమ్మించి, ఆ తర్వాత ఆ బాలికను తాను పెళ్లి చేసుకుంటానని ఒత్తిడి చేశాడు. అందుకు వారు ససేమిరా అన్నారు. 
 
ఆ తర్వాత అతని గురించి ఆరా తీయగా, మూడు నెలల క్రితం రాప్తాడు మండలంలో ఆ బాలికను రహస్య పెళ్లి చేసుకున్నట్టు తేలింది. ఈ విషయం తెలిసిన బాలిక సమీప బంధువు ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు కృష్ణాపురానికి వెళ్ళి ఆరా తీశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కామాధుడు అక్కడ నుంచి పారిపోయాడు.