తరగతి గదిలో సాయం పేరుతో లైంగిక దాడి... టీచర్‌కు 79 యేళ్ల జైలు
తరగతి గదిలో సాయం పేరుతో ఓ బాలికను లైంగికంగా వేధించిన కేసులో ఓ టీచర్‌కు 79 యేళ్ల జైలు శిక్షి విధిస్తూ కేరళ రాష్ట్రంలోని తాలిపరంబ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పునిచ్చింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని కన్నూరులోని లోయర్ ప్రైమర్ స్కూల్‌లో 4, 5వ తరగతులకు చెందిన నలుగురు విద్యార్థినిలపై పీఈ గోవిందన్ నంబూద్రి (50) అనే ఉపాధ్యాయుడు తరగతి గదిలో సాయం పేరుతో పలురకాలైన లైంగిక అత్యాచారాలకు పాల్పడుతూ వచ్చాడు.
ముఖ్యంగా, నాలుగు, ఐదు తరగతులకు చెందిన విద్యార్థినులకు ఆయన ఈ తరహా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణాలు గత 2013 జూన్ నుంచి 2014 ఫిబ్రవరి మరకు జరిగాయి. ఇవి హెచ్చుమీరిపోవడంతో బాధిత విద్యార్థినులు తల్లిదండ్రుల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో కేసు నమోదు చేయగా, తాలిపరంబ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి ముజీబ్ రెహ్మాన్ పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిశీలించి నిందితుడికి 79 యేళ్ల జైలుశిక్షతో పాటు 2.7 లక్షల అపరాధ రుసుం కూడా విధించారు.