1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 ఆగస్టు 2022 (17:22 IST)

మొబైల్ రిపేర్ కోసం వెళ్లిన బాలిక... బాయ్‌ఫ్రెండ్‌తో రేప్ చేయించిన మహిళ

victim
ముంబైలో దారుణం జరిగింది. మొబైల్ ఫోన్ రిపేర్ చేసుకునేందుకు వెళ్లిన 11 యేళ్ల మైనర్ బాలికపై తన ప్రియుడితో ఓ మహిళ అత్యాచారం చేయించింది. ఈ కేసులో ఆ మహిళ ప్రియుడితో పాటు మరో ముగ్గురు కూడా లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ నెల 17వ తేదీ తెల్లవారుజామున ఈ దారుణం జరిగింది. 
 
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ నెల 16వ తేదీ రాత్రి 7 గంటల సమయంలో బాలిక తన ఇంటికి సమీపంలోని సెల్‌ఫోన్ రిపేర్ షాపునకు వెళ్లింది. అక్కడే ఆమెకు 21 ఏళ్ల స్నేహితురాలు కనిపించింది. 
 
ఏం మాటలు చెప్పిందో కానీ, ఆ బాలికను తనతోపాటు ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లింది. తన ముగ్గురు మగ స్నేహితులకు ఫోన్ చేసి రమ్మని కబురు పెట్టింది.
 
అర్థరాత్రి సమయంలో పాండల్ సమీప ప్రాంతానికి వారు చేరుకున్నారు. ముగ్గురిలో ఒకరితో శృంగారంలో పాల్గొనాలంటూ బాలికను యువతి బెదిరించింది. వారిలో ఇద్దరు ఆమెపై అత్యాచారం చేశారు. 
 
ఆ తర్వాత అందరూ కలసి బాలికను ఆమె ఇంటి ముందు దిగబెట్టి వెళ్లిపోయారు. తనకు జరిగిన దారుణం గురించి బాలిక ఇంట్లో చెప్పింది. దీంతో బాలిక తల్లి విహార్ పోలీసులను ఆశ్రయించింది. 
 
పోలీసులు మూడు గంటల్లోనే యువతితోపాటు, మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు కాలేజీ విద్యార్థిగా గుర్తించారు. మరో వ్యక్తి కూరగాయల విక్రేత అని తేలింది.