శనివారం, 2 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 ఆగస్టు 2022 (15:22 IST)

ఎనిమిది యూట్యూబ్ చానెళ్లను బ్లాక్ చేసిన కేంద్రం

YOUTUBE
భారత్‌కు వ్యతిరేక కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నందుకుగాను కేంద్ర ప్రభుత్వం ఎనిమిది యూట్యూబ్ చానెళ్ళపై నిషేధం విధించింది. వీటిలో ఏడు చానెళ్లు భారత్‌కు చెందినవికాగా, మరొకటి పాకిస్థాన్‌కు చెందిన చానెల్ ఉంది. ఈ చానళ్లు నకిలీ, భారత్ వ్యతిరేక కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి చానెళ్ళపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. 
 
తాజాగా బ్లాక్ చేసిన చానెళ్ళ సంఖ్య 102కు చేరింది. ఒక ఫేస్‌బుక్ అకౌంటెట్‌తో పాటు ఆ ఫ్లాట్‌ఫామ్‌పై రెండు పోస్టులను కూడా కేంద్రం బ్లాక్ చేసినట్టు కేంద్ర టెలికాం, ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీ తెలిపింది. 
 
కాగా, ఈ 8 యూట్యూబ్ ఛాన‌ళ్ల‌కు మొత్తం 86 ల‌క్ష‌ల మంది స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్నారు. సుమారు 114 కోట్ల మంది ఆ వీడియోల‌ను చూశార‌ని, అయితే ఆ ఛాన‌ళ్లు విద్వేషాన్ని రెచ్చ‌గొడుతోంద‌ని, మ‌త వ్య‌తిరేక ప్ర‌చారాలు చేస్తున్న‌ట్లు ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించి కేంద్రానికి నివేదించింది.