గురువారం, 30 నవంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 ఆగస్టు 2022 (15:52 IST)

పిల్లన్ని కనండి.. నజరానా పొందండి.. రష్యా అధినేత ప్రకటన

putin
కోవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా గత కొంతకాలంగా రష్యాలో జనాభా గణనీయంగా తగ్గిపోతోంది. దీంతో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జనాభా అభివృద్ధి కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. పది లేదా అంతకంటే ఎక్కువ పిల్లల్ని కనే మహిళలకు 10 లక్షల రష్యన్‌ రూబుల్స్‌ (భారత కరెన్సీలో సుమారు రూ.13 లక్షలు) నజరానాగా ఇవ్వాలని నిర్ణయించారు.
 
ఈ మేరకు 'మదర్‌ హీరోయిన్‌' అనే పథకాన్ని ప్రకటించారు. 10 మంది లేదా అంతకంటే ఎక్కువ మందిని కనే మహిళలకు ఒకేసారి ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. అయితే దీనికి ఓ మెలిక పెట్టారు. పదో బిడ్డ మొదటి పుట్టిన రోజు నాడు ఈ మొత్తం చెల్లిస్తారట. అప్పటికి మిగిలిన తొమ్మిది మంది పిల్లలూ బతికే ఉండాలని కూడా నిబంధన విధించారు. ఇది ఎంతవరకు సాధ్యమో వ్లాదిమిరి పుతినగారే ఆలోచన చేయాల్సివుంటుంది.