1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 ఆగస్టు 2022 (15:26 IST)

భారత మహిళా క్రికెటర్లకు గుడ్ న్యూస్.. 65 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు

indian women team
భారత మహిళా క్రికెటర్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుభవార్త చెప్పింది. రాబోయే మూడేళ్ల కాలంలో భారత జట్టుకు మూడు ఫార్మాట్లలో తగినన్ని మ్యాచ్‌లను ఏర్పాటు చేసింది. ఈ మూడేళ్లలో భారత మహిళల జట్టు 65 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుంది. 
 
ఇందులో రెండు టెస్ట్‌లు, 27 వన్డేలు, 36 టీ20 మ్యాచ్‌లు వున్నాయి. భారత్.. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాతో ఒక్కో టెస్ట్‌ మ్యాచ్‌లో పోటీ పడనుంది. వన్డేలు, టీ20లు కూడా ఎక్కువగా ఈ రెండు జట్లతోనే ఉన్నాయి. మే నెలలోనే అమల్లోకి వచ్చిన ఈ ఎఫ్‌టీపీలో భారత్ ప్రస్తుతానికి 3 వన్డేలు, 3 టీ20లు పూర్తి చేసింది. 
 
మే 2022 నుంచి ఏప్రిల్‌ 2025 మధ్య కాలంలో అన్ని దేశాలకు కలిపి మొత్తంగా 310 మ్యాచ్‌‌లను షెడ్యూల్ చేసింది. పరిమిత ఓవర్ల ఆటకు ఐసీసీ ఎక్కువ ప్రాధాన్యత నిచ్చింది. ఇందులో చాలా మ్యాచ్‌లను భారత జట్టుకు కేటాయించింది.