గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 8 ఆగస్టు 2022 (22:12 IST)

ఓటీఎస్‌ఐ వ్యాపార పరివర్తన సామర్థ్యాల నుంచి ప్రయోజనం పొందుతున్న సుప్రసిద్ధ టెలికమ్యూనికేషన్‌ సంస్థలు

Narasimha
అంతర్జాతీయ డిజిటల్‌ సేవలు మరియు కన్సల్టింగ్‌ కంపెనీ, ఆబ్జెక్ట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఓటీఎస్‌ఐ) , అత్యంత అందుబాటు ధరలలో, అతి సులభంగా నిర్వహించతగిన సాఫ్ట్‌వేర్‌ డెలివరీ యంత్రాంగాన్ని నెట్‌వర్క్‌ నిర్వహణ  కోసం అందిస్తోంది. దీనిలో భాగంగా యుఎస్‌ మార్కెట్‌లో అతి పెద్ద టెలికమ్యూనికేషన్స్‌ కంపెనీలలో ఒకదాని కోసం బీఎస్‌ఎస్‌,  ఓఎస్‌ఎస్‌ వ్యవస్ధల  రిలీజ్‌ మేనేజ్‌మెంట్‌ యంత్రాగాన్ని అందించింది. ఈ క్లయింట్‌  సెల్యూలర్‌ సేవలను అందించడంతో పాటుగా గణనీయంగా ప్రపంచవ్యాప్త ఇంటర్నెట్‌ క్యారియర్‌గా వెలుగొందుతుంది. ఈ సంస్థకు విస్తృత శ్రేణిలో మొబైల్‌,  వైర్‌లెస్‌, ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ ఉంది. ఇది బహుళ ఓఈఎంలు అయినటువంటి శాంసంగ్‌, అల్కాటెల్‌, లుసెంట్‌, మోటరోలా, నోకియా, ఎరిక్‌సన్‌, ఎయిర్‌సెల్‌, హువే, సిస్కోలకు అందిస్తుంది.
 
ఓటీఎస్‌ఐ మానవ సహాయాన్ని  అతి తక్కువగా వినియోగించడంతో పాటుగా లైవ్‌ సిస్టమ్స్‌లో పలు పెటాబైట్‌ల లోడ్‌ను నిర్వహించగల బలమైన వ్యవస్ధను అభివృద్ధి చేయడం ద్వారా ఆధారపడతగ్గ వెండార్‌ భాగస్వామిగా మారింది. ఓటీఎస్‌ఐ ఇప్పుడు విభిన్నమైన సాంకేతికతలను వినియోగిస్తుంది. వీటిలో కోర్‌ జావా, పైథాన్‌, డాట్‌ నెట్‌, హైవ్‌, హెచ్‌డీఎఫ్‌ఎస్‌, స్కార్క్‌ స్కాలా, ఐబీఎం నెటెజ్జా వంటివి ఉన్నాయి.
 
‘‘టెలికామ్‌ డొమైన్‌ ఎస్‌ఎంఈ, బిజినెస్‌ రిక్వైర్‌మెంట్‌ కన్పల్టెంట్లు, టెక్నికల్‌ ఆర్కిటెక్ట్స్‌ మరియు బిగ్‌డాటా, హడూప్‌ కోసం అడ్మిన్స్‌ , ఎంపీపీ ఆర్కిటెక్ట్స్‌, నెటెజ్జా డీబీ2/ఐఏఎస్‌, టెరా డాటా, ఎనలిటిక్స్‌ ఆర్కిటెక్ట్స్‌, ఎంఎస్‌బీఐ/పవర్‌బీఐ, టాబ్లూ, మైక్రో స్ట్రాటజీ, కస్టమైజ్డ్‌ ఎనలిటిక్స్‌ ను జావా, పైథాన్‌, డాట్‌ నెట్‌, యాంగ్యులర్‌ జెఎస్‌, నోడ్‌ డాట్‌  జెఎస్‌, రెస్ట్‌ ఏపీఐ మొదలైన వాటిని అందించగల ఒక చక్కటి సమతుల్యత కలిగిన బృందం మాకు ఉంది. మా టీమ్‌ అత్యంత విజయవంతంగా పరిశ్రమలో అత్యుత్తమ ప్రక్రియలను నిర్మించడంతో పాటుగా అత్యంత క్లిష్టమైన ఆర్కిటెక్చర్‌లో కూడా  బహుళ పెటాబైట్ల డాటాను నిర్వహిస్తున్నారు’’ అని నరసింహ గొండి, ఫౌండర్‌–ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌, ఓటీఎస్‌ఐ అన్నారు.