మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 ఆగస్టు 2022 (16:49 IST)

సామూహిక అత్యాచారం.. బాలిక గర్భం దాల్చటంతో..

rape
ఆరో తరగతి చదువుతున్న బాలికపై ఇద్దరు మైనర్లు, ఓ మేజర్​ కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన వల్ల బాలిక గర్భం దాల్చటంతో అసలు విషయం బయటపడింది. 13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  
 
మహబూబాబాద్‌లో బాలికపై ఇద్దరు మైనర్ బాలురు, ఓ వ్యక్తి కలిసి కొద్ది నెలల కిందట అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు తెలిసింది.
 
విషయం తెలిసిన వెంటనే బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. బాధితురాలిని మహబూబాబాద్​లోని బాలికల సంరక్షణా కేంద్రానికి తరలించారు.