ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 అక్టోబరు 2022 (21:18 IST)

హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు: రోడ్లపై నీరు.. ట్రాఫిక్ జామ్

rain
హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం సాయంత్రం కూడా భాగ్యనగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. పంజాగుట్ట, అమీర్ పేట, ఖైరతాబాద్, నాంపల్లి, షేక్ పేట, నాంపల్లి, గోల్కొండ, ఎస్సార్ నగర్, హైటెక్ సిటీ, మూసాపేట, మాదాపూర్, యూసుఫ్ గూడ, సోమాజిగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. 
 
దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయమైనాయి. పలు చోట్ల రోడ్లపై నీరు ప్రవహించింది. ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింద భారీగా వర్షపు నీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పలు చోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లాయి.