1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. students drowned to death in krishna district eturu munneru stream

మున్నేటిలో ఈత‌కు వెళ్ళి... పాపం! 12 ఏళ్ల బాలురు అయిదుగురి మృతి

students
కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరులో విషాదం చోటుచేసుకుంది. మున్నేరు వాగులో 5 గురు చిన్నారులు గల్లంత‌య్యారు. వారంతా మృతి చెందార‌ని స‌మాచారం అందింది. గ‌ల్లంత‌యిన విషయం తెలుసుకున్నఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అధికారులతో మాట్లాడుతూ రెస్క్యూ టీంను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థులంతా క్షేమంగా తిరిగి రావాలని కోరుకున్నారు. కానీ, వారంతా ఈత రాక మునిగి మృతి చెందిన‌ట్లు తెలుస్తోంది. అందులో న‌లుగురు విద్యార్థుల మృత దేహాల‌ను వెలికితీశారు.
 
 
గల్లంతైన విద్యార్థులు చరణ్, బాలయేసు, స‌న్నీ, అజయ్, రాకేష్ గా గుర్తించారు. వీరంతా స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 7 వ తరగతి చదువుతున్నారు. ఇందులో న‌లుగురి మృత దేహాలు దొరికాయి. 
మున్నేరువాగులో ఈత కోసం వెళ్లిన చిన్నారులు బాల యేసు, చరణ్, అజయ్, సన్నీ, రాకేష్ అంతా 12 సంవత్సరాల లోపు వారే. గల్లంతైన ఐదుగురు దుర్మరణం కావ‌డంతో గ్రామంలో తీవ్ర విషాదం నెల‌కొంది. చిన్నారుల కోసం విస్తృతంగా గాలింపు జరిపిన ఎన్డిఆర్ఎఫ్, న‌లుగురి మృత‌దేహాల‌ను వెంట‌నే వెలికితీసింది.
About Writer
జెఎస్కే
తర్వాతి కథనం
మరో అద్భుతం, మనిషికి పంది గుండె అమర్చారు, విజయవంతం