1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 జనవరి 2022 (14:55 IST)

కర్నూలులో 40 మంది విద్యార్థులకు అస్వస్థత

కర్నూలు జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర, పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన 40 మంది విద్యార్థులకు అస్వస్థతకు లోనయ్యారు. ఈ విద్యార్థుల అస్వస్థతపై కాలేజీ యాజమాన్యం గోప్యత పాటించండం అనేక అనుమానాలకు తావిస్తుంది. 
 
ఈ కాలేజీకి చెందిన పలువురు విద్యార్థులు గురువారం రాత్రి హాస్టల్‌లో భోజనం చేసారు. వారిలో దాదాపు 40 మంది వరకు విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. కొందరు విద్యార్థులు వాంతులు, విరేచానాలు చేసుకున్నారు. ఈ విషాయన్ని కొందరు విద్యార్థులు హాస్టల్‌ వార్డెన్‌కు సమాచారం చేరవేశారు. 
 
దీంతో అప్రమత్తమైన కాలేజీ యాజమాన్యం అస్వస్థతకు లోనైన విద్యార్థులను హుటాహుటిన ఎవరికీ తెలియకుండా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. మొత్తం 40 మంది విద్యార్థుల్లో 15 మంది తీవ్రంగాను, మరో ఐదుగురి పరిస్థితి విషమంగాను ఉన్నట్టు సమాచారం. విద్యార్థుల అస్వస్థతకు గల కారణాలు తెలియాల్సివుంది.