గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 7 జనవరి 2022 (18:15 IST)

ఆరుగురు న‌ర్సింగ్ విద్యార్థినుల‌కు క‌రోనా పాజిటివ్...క‌ల‌క‌లం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనూ క‌రోనా క‌ల‌క‌లం సృష్టిస్తోంది. దేశ విదేశాల‌లో శ‌ర‌వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ ఇపుడు ఇక్క‌డా ఇబ్బంది పెడుతోంది. చివ‌రికి వైద్య సిబ్బందికి కూడా ఇది ప్రాణాంతకంగా మారుతోంది.
 
 
కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్నఆవుటపల్లిలోని పిన్నమనేని సిద్దార్థ నర్సింగ్ కాలేజీలో కరోనా కలకలం రేగింది. కాలేజీలో నర్సింగ్ కోర్సు చేస్తున్న ఆరుగురు స్టూడెంట్స్ కి కరోనా పాజిటివ్ తేలింది. పిన్నమనేనిలోని కరోనా హాస్పిటల్ కు వారిని తరలించారు. ఆరుగురితో కాంటాక్ట్ అయిన మరో 20 మంది స్టూడెంట్స్ ని హోమ్ ఐసోలేషన్ కి తరలించారు. కాలేజీ మొత్తం శానిటైజేషన్ చేసిన  యాజమాన్యం అన్ని జాగ్ర‌త్త‌లూ తీసుకుంటోంది. కరోనా పాజిటివ్ వచ్చిన ఆరుగురు కేరళకు చెందిన వారిగా గుర్తించారు.