1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. TTD released the Tirumala Srivari Darshan tickets

తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్లను విడుదల చేసిన తితిదే

TTD
తిరుమల: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తితిదే విడుదల చేసింది. జనవరి నెలకు సంబంధించిన కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. రోజుకు 20 వేల టికెట్ల చొప్పున జనవరి 4 నుంచి 31వ తేదీ వరకు రూ.300 టికెట్లను తితిదే వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
 
ఒక యూజర్‌ ఐడీ నుంచి ఆరు టిక్కెట్ల వరకూ బుక్‌ చేసుకునే సదుపాయం కల్పించారు. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులకు దర్శనం కల్పిస్తున్న తితిదే నెలకొకసారి టిక్కెట్లను ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేస్తోంది. 
 
వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని తితిదే ఈ నెల 25 నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తోంది. ఈ కార్యక్రమం జనవరి 4వ తేదీ వరకూ జరగనుంది. కరోనా దృష్ట్యా తొలుత స్థానికులకే వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామని ప్రకటించిన తితిదే అనంతరం క్యూలైన్లలో నిల్చున్న వారికి సైతం టోకెన్లను జారీ చేసిన విషయం తెలిసిందే.
తర్వాతి కథనం
భయపడుతూ బతకలేము.. నారా లోకేష్‌