1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. YS Jagan in Manipal Hospital For General Checkup

ఆస్పత్రికి సీఎం జగన్... కాలికి గాయం కావడంతో ...

YS Jagan
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మణిపాల్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఆయనకు వైద్యులు వివిధ రకాల వైద్య పరీక్షలు చేశారు. ముఖ్యంగా, స్కానింగ్ చేశారు. సాధారణ వైద్య పరీక్షలు కూడా చేశారు. 
 
ఇటీవల వ్యాయామం చేస్తుండగా కాలికి గాయమైంది. మరోసారి కుడి కాలుకు వాపు రావడంతో పరీక్షల కోసం సీఎం ఆస్పత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం 9.45 నిమిషాలకు ఆస్పత్రికి వచ్చారు. రెండుగంటల పాటూ అక్కడే ఉన్నారు. ఆ తర్వాత తిరిగి క్యాంప్ ఆఫీసుకు వెళ్లిపోయారు.
 
ముఖ్యమంత్రి జగన్ కాలు బెణుకుతోనే రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారట. తాజాగా నొప్పి మరింత పెరగడంతో మణిపాల్ ఆస్పత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఇావాళ సీఎం జగన్ విద్యారంగంపై సమీక్ష చేయాల్సి ఉంది. మరి సీఎం జగన్ సమీక్ష చేస్తారో లేదో ఆయనకే ఎరుక. 
తర్వాతి కథనం
కరోనా వైరస్ సోకి 501 మంది మృత్యువాత