శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 నవంబరు 2021 (19:29 IST)

ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో ముగిసిన జగన్ భేటీ

Jagan_odissa cm
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. భువనేశ్వర్‌లోని సచివాలయంలో ఇద్దరు సీఎంలు సమావేశమయ్యారు. మూడు అంశాలపై ఒడిశా సీఎంతో వైఎస్‌ జగన్‌ చర్చించినట్లుగా తెలుస్తోంది.
 
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. భువనేశ్వర్‌లోని సచివాలయంలో ఇద్దరు సీఎంలు సమావేశమయ్యారు. మూడు అంశాలపై ఒడిశా సీఎంతో వైఎస్‌ జగన్‌ చర్చించినట్లుగా తెలుస్తోంది. 
 
ఒడిశా అభ్యంతరాలతో అనేక దశాబ్దాలుగా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలపై ఈ భేటీలో జగన్ చర్చలు జరిపారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్‌, ఇరిగేషన్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ శ్యామలరావు, రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రెటరీ ఉషా రాణి భేటీలో పాల్గొన్నారు.
 
ప్రధానంగా వంశధార నదిపై నేరేడి బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు నిర్మాణం, కొఠియా గ్రామాల సమస్యలపై సీఎం వైఎస్‌ జగన్‌.. ఈ భేటీలో నవీన్ పట్నాయక్ చర్చించారు. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారానికి జాయింట్ కమిటీ వేయాలని ఇద్దరు సీఎంలు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.