గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 నవంబరు 2021 (15:22 IST)

రోహిత్ శర్మ సరికొత్త రికార్డు.. మూడు వేల పరుగులతో..

టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో మూడు వేల పరుగులు సాధించాడు. ఈ ఘనత సాధించిన 3వ ప్లేయర్‌గా నిలిచాడు. 108 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్ అందుకున్నాడు. 
 
టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా నమీబియాతో మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఈ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20 క్రికెట్‌లో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్ల లిస్టులో రోహిత్ శర్మ కూడా చేరాడు. 
 
టీ20 క్రికెట్‌లో ఇప్పటివరకు ఎక్కువ పరుగులు చేసి నెంబర్ వన్ స్థానంలో విరాట్ కోహ్లీ (3227) ఉండగా.. న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్(3115) రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానానికి రోహిత్ శర్మ చేరుకున్నాడు. కాగా, టీ20లలో 4 సెంచరీలు చేసింది రోహిత్ మాత్రమే. ఇక 23 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.