సంబంధిత వార్తలు
- రేణిగుంటలో దారుణం : కుమార్తెపై తండ్రి అత్యాచారం
- నా బిడ్డకు సెక్స్ టాయ్ కొనిస్తానంటున్న తల్లి.. ఫైరవుతున్న నెటిజన్స్
- కూతురు పెళ్లి కోసం డబ్బు దాచడం కాదు, ముందు ఆ పని చేయండి: సమంత
- నా కుమార్తె, నా భార్యతో నేను బయటకెళ్తే ఇలా అర్థం చేసుకుంటారా?: పట్టాభి
- అందుకే పాకిస్థాన్ ఆటగాళ్లు ధోనీ, కోహ్లీని కలిశారు.. వసీమ్ అక్రమ్
విరాట్ కోహ్లీ.. నీ కూతురిని రేప్ చేస్తాం... అగంతకుడి వార్నింగ్
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో భారత్ క్రికెట్ జట్టు చెత్త ఆటతీరుతో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో చిత్తుగా ఓడిపోయింది. దీంతో ఎన్నో విమర్శలను మూటగట్టుకుంది. సామాజిక మాధ్యమాల్లో భారత క్రికెటర్లపై దారుణ ట్రోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో కొందరు దుండగులు మరింత నీచానికి ఒడిగట్టారు.
కెప్టెన్ విరాట్ కోహ్లీని దూషించడం సహా అతడి కూతురికి అత్యాచార బెదిరింపులకు పాల్పడ్డారు. చిన్నారి ఫొటోను విడుదల చేయాలని, ఆమెపై అత్యాచారానికి పాల్పడతామంటూ హేయమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. భారత జట్టు పేలవ ప్రదర్శనకు గతంలో ఏ సంబంధం లేకుండా అనుష్కను ట్రోల్ చేసేవారు.
ఇప్పుడు మానవత్వాన్ని మంటగలిపేలా, అన్ని హద్దులూ దాటుతూ అభం శుభం తెలియని చిన్నారిపై అసభ్య వ్యాఖ్యలు చేయడం వారిలోని పశుతత్వాన్ని చాటుతోందంటూ పలువురు పలువురు సోషల్ మీడియా యూజర్లు మండిపడుతున్నారు. ఇలాంటి బెదిరింపులను అరికట్టేలా కఠిన చట్టాలు తెచ్చి, అలాంటి దుష్టులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
తర్వాతి కథనం
