సంబంధిత వార్తలు
- నా బిడ్డకు సెక్స్ టాయ్ కొనిస్తానంటున్న తల్లి.. ఫైరవుతున్న నెటిజన్స్
- కూతురు పెళ్లి కోసం డబ్బు దాచడం కాదు, ముందు ఆ పని చేయండి: సమంత
- 'వాల్తేర్ వీరయ్య'గా చిరంజీవి - 15 నుంచి 'భోళా శంకర్' షూటింగ్
- నా కుమార్తె, నా భార్యతో నేను బయటకెళ్తే ఇలా అర్థం చేసుకుంటారా?: పట్టాభి
- అంజిరెడ్డి తాత మనవరాలి పెళ్లికి నారా లోకేష్ కానుక 3 లక్షలు
రేణిగుంటలో దారుణం : కుమార్తెపై తండ్రి అత్యాచారం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతికి కూతవేటు దూరంలో ఉన్న రేణిగుంటలో ఓ దారుణం జరిగింది. 14 యేళ్ల కన్న కూతురిపై ఓ కామాంధ తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. సభ్యసమాజం తలదించుకునే ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రేణిగుంట మండలానికి చెందిన ఓ వ్యక్తి తన కుమార్తెను తిరుపతిలో వైద్యపరీక్షల కోసమని అక్టోబరు 24వ తేదీన ఇంటి నుంచి తీసుకెళ్లాడు.
ఆపై రేణిగుంట, తిరుపతి మార్గంలోని లక్ష్మీపురం కాలనీకి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన తల్లికి ఆలస్యంగా చెప్పడంతో ఆదివారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు.
తర్వాతి కథనం
