కరోనా వైరస్ సోకి 501 మంది మృత్యువాత
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదులో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఒకరోజు పదివేలకు చేరుకుంటే మరోరోజు 15 వేల వరకు నమోదవుతున్నాయి. అలాగే, ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది.
తాజాగా గడిచిన 24 గంటల్లో 12,516 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. బుధవారం 501 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. యాక్టివ్ కేసులు 267 రోజుల కనిష్ఠానికి చేరాయి. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 1,37,416 మంది చికిత్స తీసుకుంటున్నారు.
నిన్న కరోనా నుంచి 13,155 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,38,14,080కు చేరింది. మృతుల సంఖ్య మొత్తం 4,62,690కి పెరిగింది. నిన్న 53,81,889 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. ఇప్పటివరకు మొత్తం 1,10,79,51,225 డోసుల వ్యాక్సిన్లు వాడారు. నిన్న 11,65,286 కరోనా పరీక్షలు చేశారు.