గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 9 నవంబరు 2021 (11:39 IST)

పార్టీ అధినేత జగన్‌పై రాజద్రోహం కేసు పెట్టాలి : వైకాపా ఎంపీ

తమ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాజద్రోహం కేసు పెట్టాలంటూ ఆ పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 'కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక పథకాల ద్వారా జగన్‌ ప్రభుత్వం లబ్ధిపొందుతోంది. అయినప్పటికీ సీఎం జగన్‌రెడ్డి తన రాజకీయ లబ్ధికోసం కేంద్రాన్ని బలిపశువు చేయడానికి చూస్తున్నారు. కేంద్రంపై తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. అందుకు సీఎం జగన్‌పై రాజద్రోహం కేసు పెట్టాలి' అంటూ ఆయన డిమాండ్ చే్శారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 'ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలను ఎత్తిచూపిన నేరానికి నాపై గతంలో రాజద్రోహం కేసు పెట్టి హింసించలేదా? ఇపుడు జగన్‌ ప్రభుత్వం కూడా అదేపని చేస్తున్నప్పుడు రాజద్రోహం కేసు ఎందుకు పెట్టకూడదు? అని ప్రశ్నించారు. పెట్రోల్‌, డీజిల్‌పై రోడ్ల అభివృద్ధి పేరుతో సెస్‌ వసూలు చేసిన్నా వాటి కోసం ఒక్క పైసా కూడ ఖర్చుచేయడం లేదని ఆరోపించారు. 
 
విద్యుత్‌ కొనుగోలులో అనేక అక్రమాలు జరుగుతున్నాయంటూ వివరణాత్మక ఆరోపణలు చేశారు. కేవలం 48 గంటల వ్యవధిలో చేసుకున్న ఒప్పందం వెనుక చక్రం తిప్పిన వ్యక్తి ఎవరని నిదీశారు. అమరావతి రైతులకు ప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరారు. రైతుల పాదయాత్రను అడ్డుకోడానికి పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించడం విచారకరమని రఘురామరాజు అన్నారు.